దివ్యాంగులకు కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇస్తాను - కావలి శాసనసభ్యులు

 దివ్యాంగులకు కమ్యూనిటీ హాల్ నిర్మించి ఇస్తాను 

- అర్హులైన ప్రతి ఒక్కరికీ పెన్షన్, ఇంటి స్థలం 

- కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి 

దివ్యాంగులకు కమ్యూనిటీ హాల్ ఒకటి నిర్మించి ఇస్తానని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న వారోత్సవాల్లో ఆదివారం ఆయన పాల్గొన్నారు. దివ్యాంగుల సమస్యలను ఆయన తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివ్యాంగులందరికీ ఇంటి స్థలం, పెన్షన్ అందేలా చూస్తామని తెలిపారు. విడతల వారీగా కాలనీలోని ప్రతి రోడ్డును సిసి రోడ్లుగా మారుస్తామని, కరెంటు సరఫరాను మెరుగుపరుస్తామని తెలిపారు. దివ్యాంగులందరికీ వారు నివసించే గ్రామాల్లోనే ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో దివ్యాంగుల నాయకుడు మండవ వెంకట్రావు, కావలి ఒకటవ పట్టణ ఎస్సై సుమన్, తెలుగుదేశం నాయకులు శివ, దివ్యాంగుల నాయకులు మహబూబ్ బాషా, మాలకొండయ్య, సుబ్రహ్మణ్యం, కోడూరు సోమయ్య, ఆదోని రమణయ్య, శెట్టిపల్లి రామయ్య, మాధవరావు, తల్లిబోయిన శ్రీనివాసులు, శంకర్ రాజు, మరియమ్మ, కొండూరు పోలమ్మ భాస్కర్, తదితరులు పాల్గొన్నారు.



google+

linkedin