తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు - కావలి శాసనసభ్యులు

 తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి పొట్టి శ్రీరాములు - కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

 తెలుగువారి ఆత్మగౌరవం కోసం పోరాడిన వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని, ఆయన ఆత్మ త్యాగం, బలిదానం ఫలితంగా ఆంధ్ర రాష్ట్రం, ప్రత్యేక గుర్తింపు రావటం జరిగిందని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. ఆదివారం పొట్టి శ్రీరాములు వర్ధంతిని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన ఆత్మార్పణ దినం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ట్రంకు రోడ్డు లోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం, తెలుగువారి ఆత్మ గౌరవం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం 56 రోజులపాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి అశువులు బాసిన వ్యక్తి అమరజీవి అని తెలిపారు. ఆయన సేవలను, బలిదానాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మరణించిన రోజును ఆత్మార్పణ దినంగా ప్రభుత్వం ప్రకటించడం జరిగిందని తెలిపారు. పొట్టి శ్రీరాములుకు కావలి నియోజకవర్గం లోని జువ్వలదిన్నెతో అనుబంధం ఉందని తెలిపారు. జువ్వలదిన్నెలో ఏర్పాటు చేసిన ఫిషింగ్ హార్బర్ కు పొట్టి శ్రీరాములు పేరును, కావలి ట్రంకు రోడ్డుకు మాగుంట పార్వతమ్మ పేరును పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబును కోరడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం కావలి మండల అధ్యక్షులు తటవర్తి రమేష్, ఆర్యవైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ తట్టవర్తి వాసు, తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు, రాష్ట్ర కార్యదర్శి మలిశెట్టి వెంకటేశ్వర్లు, మొగిలి కల్లయ్య, రాష్ట్ర లీగల్ సెల్ ఉపాధ్యక్షులు పోట్లూరి శ్రీనివాసులు, ఏరియా వైద్యశాల డైరెక్టర్ చవల రామకృష్ణ, కోట రమేష్, గాధంశెట్టి వేణుగోపాల్, విట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్ సునీల్, బిజెపి నాయకులు కందుకూరి సత్యనారాయణ, సివిసి సత్యం జనసేన కావలి నియోజకవర్గ ఇంచార్జి అలహరి సుధాకర్, జనసేన పట్టణ అధ్యక్షులు పొబ్బ సాయి విఠల్, ఆర్యవైశ్య నేతలు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు..



google+

linkedin