పలు కార్యక్రమంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి 13-03-2025

 పలు కార్యక్రమంలో ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి 

కావలి నియోజకవర్గంలో రాజ్ న్యూస్ రిపోర్టర్ పనిచేస్తున్న బత్తిన మనోహర్ ఇటీవల రోడ్డు ప్రమాదం జరిగి కావలి పట్టణంలోని వారి నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు విషయం తెలుసుకున్న  కావలి కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు వారి నివాసానికి వెళ్లి రిపోర్టర్ మనోహర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి త్వరగా కోలుకోవాలని ధైర్యం చెప్పారు..కావలి పట్టణం తుమ్మలపెంట రోడ్డు  నందు నూతనంగా ఏర్పాటు చేసిన ఢిల్లీ దర్దర్ ఫ్యామిలీ డాబాను..కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి గారు గురువారం ప్రారంభించారు.వ్యాపారం దినదినాభివృద్ధి జరగాలని కోరుకున్నారు..కావలి పట్టణం 4వ వార్డుకు పాతఊరుకి చెందిన టిడిపి నాయకుడు  ఉప్పాల శ్రీనివాసులు తల్లి రావమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు విషయం తెలుసుకున్న కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి  ఆయన నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు,కార్యకర్తలు అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

google+

linkedin

Popular Posts