ఘ‌నంగా కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గరుడ వాహన సేవ

- ఘ‌నంగా కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గరుడ వాహన సేవ..

- అంగరంగ వైభవంగా ప్రసనుడి బ్రహ్మోత్సవాలు

- శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి గరుడ వాహన సేవలో పాల్గొని స్వామి వారి వాహనాన్ని తన బుజాలతో మోసిన ఎమ్మెల్యే..

- ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు దగ్గరుండి  పర్యవేక్షిస్తున్న  ఎమ్మెల్యే

- కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి..

నెల్లూరు జిల్లా..కావలి నియోజకవర్గం కొండ బిట్రగుంట బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. నాలుగోరోజు బుధవారం రాత్రి వైభవంగా గరుడ వాహన సేవ జరిగింది.స్వామి అలంకార సేవ, మంగళనీరాజనం నిర్వహించారు. అనంతరం అర్చక పండితులు,యజ్ఞికులు, పారాయణికులు, భక్తుల గోవింద నామస్మరణల మధ్య మేళా తాళాలతో అలంకార సేవలో గరుడవాహనంపై ఊరేగగా,స్వామివారిని దర్శించుకుని భక్తుల పులకించారు.గరుడ వాహన సేవలో కావలి ఎమ్మెల్యే కావ్య క్రిష్ణా రెడ్డి పాల్గొని స్వామి వారి వాహనాన్ని తన బుజాలతో మోశారు.భక్తి శ్రద్ధలతో ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు దగ్గరుండి ఎమ్మెల్యే పర్యవేక్షించారు...ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. గరుడ సేవలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నా ఏడు రోజులపాటు జరిగే ప్రసన్న వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలను టీటీడీ వేద పండితుల సూచనలతో ఆగమ శాస్త్ర ప్రకారం అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నామని ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలియజేశారు..ఈ బ్రహ్మోత్సవాలకు పాల్గొనే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా  అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతినిత్యం  శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ప్రత్యేక పూజలు జరుగుతాయి అన్నారు. ఈ పూజా కార్యక్రమాలకు వచ్చే భక్తులకు నైవేద్యాలు తోపాటు  పలు రకాల సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశామన్నారు..అత్యంత వైభవంగా కొండ బిట్రగుంట ప్రసన్నడి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామన్నారు..ఈ బ్రహ్మోత్సవాలు ముగిసే అంతవరకు పోలీస్ బందోబస్తు,మున్సిపాలిటీ పర్యవేక్షణ,విద్యుత్ అధికారులు సిబ్బంది ప్రతిక్షణం పర్యవేక్షిస్తుంటారని తెలిపారు.. భక్తులందరూ కూడా ఆలయ కమిటీ వారికి సహకరించి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా  కలియుగ దైవం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దర్శించుకుని  స్వామివారి కృపకు పాత్రులు కాగలరని  కోరారు...ఈ కార్యక్రమంలో స్వామి  వారి సేవకులు,భక్తులు వేలాదిగా పాల్గొన్నారు..


google+

linkedin