గ్రంధి జీవితం కావలి కి అంకితం - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

 గ్రంధి జీవితం కావలి కి అంకితం - కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి

తెలుగుదేశం పార్టీ కావలి పట్టణ మాజీ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మాజీ ఏఎంసి చైర్మన్ గ్రంధి యానాది శెట్టి తన జీవితాన్ని కావలి కి అంకితం చేశారని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి తెలిపారు. సోమవారం కావలి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన మాట్లాడారు. యానాశెట్టి దాదాపు 30 సంవత్సరాల పాటు తన రాజకీయ జీవితాన్ని కావలికి అంకితం చేసి, కావలి పట్టణాన్ని అభివృద్ధి పరచడంలో కీలక పాత్రను పోషించాడని తెలిపారు. పేదవాడిని అక్కున చేర్చుకొని పేద, బడుగు, బలహీన వర్గాల కోసం తన జీవితాన్ని అర్పించిన వ్యక్తి యానాది శెట్టి అని, వారు అకాల మరణం కావలి ప్రజలని, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని దిగ్భాంతికి గురి చేసిందన్నారు. కావలికి ఎనలేని సేవలు చేసినటువంటి మహోన్నత వ్యక్తిని కావలి ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకొని స్మరించుకునే విధంగా కావలి నడి బొడ్డున వారి కాంశ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని, వారిని చూసి అయినా ప్రజలు అటువంటి భావాలను పునికిపుచ్చుకొని, మనం కూడా జీవితంలో ప్రజలకు కొంత సేవ చేయాలని, ఒక సంకల్పానికి వచ్చే విధంగా, ఆదర్శంగా ఉండే విధంగా కాంశ్య విగ్రహాన్ని తన ట్రస్ట్ ద్వారా సొంత నిధులతో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఏప్రిల్ 8వ తేదీన సాయంత్రం 3.30 గంటలకు రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కలిసి ఈ కాంశ్య విగ్రహాన్ని ఆవిష్కరించడం జరుగుతుందన్నారు. గ్రంధి అభిమానులు, ఆయన శ్రేయోభిలాషులు, బంధు మిత్రులు, అన్ని పార్టీల శ్రేణులు ఈ విగ్రహావిష్కరణకు విచ్చేయాలని, వారి ఆత్మకు శాంతి చేకూరే విధంగా వారు చేసినటువంటి సేవలను కొనియాడే విధంగా అందరం కలిసి ఈ కాంశ్య విగ్రహాన్ని ప్రారంభిద్దామని తెలిపారు. గ్రంధి అభిమానులు అన్ని పార్టీల్లో ఉన్నారని, అందరికీ సేవ చేసినటువంటి వ్యక్తి కాబట్టి పార్టీలకు అతీతంగా అందరూ కూడా కలిసి రావాలని ఎమ్మెల్యే కోరారు.



google+

linkedin