చదువును ఇష్టంగా మలుచుకుంటే అదృష్టం వరిస్తుంది - కావలి శాసనసభ్యులు

 చదువును ఇష్టంగా మలుచుకుంటే అదృష్టం వరిస్తుంది - కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి 

చదువును ఇష్టంగా మలచుకుంటే అదృష్టం వరిస్తుందని జీవితం సుఖమయం అవుతుందని కావలి శాసనసభ్యులు దగుమాటి వెంకట క్రిష్ణారెడ్డి అన్నారు. కావలి పట్టణంలోని విశ్వశాంతి హైస్కూల్ లో శనివారం రాత్రి జరిగిన పాఠశాల 34వ వార్షికోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. విద్యార్థులు, పాఠశాల యాజమాన్యం ఆయనకు ఘన స్వాగతం పలికారు. వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విద్యార్థులు తమ కలలను సాకారం చేసుకునే వయసు ఇదని, ఎక్కడ కష్టపడతామో అక్కడ విజయం లభిస్తుందని తెలిపారు. సాధారణ పేద రైతు కుటుంబం నుండి ఎమ్మెల్యేగా కష్టపడి తాను ఎదిగిన విధానాన్ని విద్యార్థులకు వివరించారు.. జీవితంలో కష్టపడనిదే ఏమీ సాధించలేమని, ఆటుపోట్లను, అవమానాలను తట్టుకొని నిలబడ్డప్పుడే విజయం వరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల కరస్పాండెంట్ డివి రమణయ్య, పాఠశాల సిబ్బంది, స్థానిక వార్డు నాయకులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు..


google+

linkedin